డొనాల్డ్ ట్రంప్‌కు ఆ రెండు దేశాలు వార్నింగ్
అమెరికా తీరుపై రష్యా, ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వ సేనలు లక్ష్యంగా అమెరికా మరిన్ని దాడులు చేస్తే, తాము సైనిక దాడులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించాయి. అసద్ సేవలపై క్షిపణి దాడులు నిర్వహించడం ద్వారా ట్రంప్ లక్ష్మణ రేఖ (రెడ్‌లైన్)ను దాటారని పేర్కొన్నాయి. ఇప్పటినుంచి భద్రతా పరమైన లక్ష్మణరేఖను ఉల్లంఘిస్తే మేం దీటుగా సమాధానమిస్తాం. మేం ఎలా బదులివ్వగలమో అమెరికాకు బాగా తెలుసు అని రష్యా, ఇరాన్ ఆర్మీ చీఫ్‌లు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లండన్‌లో రష్యా రాయబార కార్యాలయం ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సిరియాలోని రెబెల్స్ అధీనంలో ఉన్న ప్రాంతంలో రసాయనిక దాడి జరగడం, ఈ దాడి అసద్ ప్రభుత్వం పనేనని ఆరోపణలు రావడంతో సిరియా విషయంలో అమెరికా తన వైఖరి మార్చుకుంది.
