సెనేటర్ భార్యకు మోదీ సారీ!
అమెరికా సెనేటర్ జాన్ కార్నిన్ భార్య సాండీకి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. అదివారం సాండీ పుట్టిన రోజు. అయితే భార్యతో సరదాగా గడపకుండా భర్త.. హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మోదీ ఆమెకు సారీతో పాటు బర్త్డే విషెస్ చెప్పారు. మీ పుట్టిన రోజు మీ జీవిత భాగస్వామి మీతో ఉండకుండా.. నాతో ఉన్నారు. అందుకు మీకు కోపం ఉండొచ్చు.. సారీ అని ఆమెతో చెప్పారు.
