ఢీకొడతాం…
‘సిరియాపై అమెరికా చేసిన క్షిపణి దాడి క్షమించరానిది, ఏమాత్రం సమ్మతించదగినది కాదని ఉత్తర కొరియా ఖండించింది.. ఒక సార్వభౌమ దేశంపై అమెరికా చేసిన దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి మాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నాం. ఇలాంటి దాడులు ఏక్షణమైనా తమపై జరగొచ్చని అమెరికా పరోక్షంగా తెలిపింది. అందుకే మేం సైనిక సంపత్తిని పెంచుకోవడంపై మరింత వేగాన్ని పెంచుతాం. తగిన సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బదులిస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
