సుప్రీం న్యాయమూర్తిగా నీల్ గోర్సచ్ ప్రమాణం
అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నీల్ గోర్సచ్ వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. డెమోక్రాట్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ నీల్ గోర్సచ్ను ఈ పదవికి నియమించి తన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. దీన్ని తన ప్రభుత్వం సాధించిన రాజకీయ విజయంగా ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా గోర్సచ్ నియామమకంతో సుప్రీంకోర్టులో ఐదుగురు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు, నలుగురు లిబరల్స్ వున్నారు.
