అమెరికా ప్రథమ మహిళ పోటో విడుదల
అమెరికా ప్రథమ మహిళ మిలానియా ట్రంప్ అధికారిక చిత్రపటాన్ని శ్వేతసౌధం నేడు విడుదల చేసింది. వైట్‌హౌస్ కిటికీ ముందు దిగిన ఈ ఫొటోలో మిలానియా నలుపు రంగు జాకెట్ వేసుకుని, చేతులు కట్టుకుని కన్పించారు. ప్రథమ మహిళగా దేశానికి సేవ చేయడం గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లోనూ అమెరికా ప్రజల తరపున నా వంతు బాధ్యతలు నిర్వర్తిస్తాను అని ఫొటో విడుదల సందర్భంగా మిలానియా ట్రంప్ వ్యాఖ్యానించారు.
