మెలానియాతో డెయిలీ మెయిల్ రాజీ
ప్రముఖ ఆంగ్ల పత్రిక డెయిలీ మెయిల్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ విజయం సాధించారు. మెలానియా గతంలో వ్యభిచార వృత్తిలో ఉండేవారని పేర్కొంటూ డెయిలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై మెలానియా మేరీల్యాండ్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీంతో డెయిలీ మెయిల్ యాజమాన్యం మెలానియాతో రాజీకి వచ్చింది. ఈ విషయాన్ని పత్రిక స్యయంగా తెలిపింది. మెలానియాకు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆమెకు 2.9 మిలియన్ డాలర్లు (రూ.19 కోట్లు )చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. కాగా మెలానియా 150 మిలియణ్ డాలర్లు (రూ.1000 కోట్లు ) డిమాండ్ చేశారు. మెలానియా 1990 దశకంలో వ్యభిచార వృత్తిలో (ఎస్కార్ట్) ఉన్నారని, ఈ విషయాన్ని ఆమె పని చేసిన మోడలింగ్ ఏజెన్సీ నిర్వాహకుడే చెప్పాడని పేర్కొంటూ గత ఏడాది ఆగస్టులో డెయిలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మెయిల్ ఆన్‌లైన్‌తో పాటు మరో నాలుగు వార్తా సంస్థలు కూడా ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలపై స్పందించిన తన పరువకు భంగం వాటిల్లిందని పేర్కొంటూ దావా వేశారు.
