అమెరికా హెలికాప్టర్ సొసైటీ పురస్కారం అందుకున్న ప్రవాస భారతీయుడు
ప్రవాస భారతీయ ఎయిరోనాటిక్స్ ఇంజనీరు, రిటైర్డు లెఫ్టినెంట్ కల్నల్, డాక్టర్ అరవింద్ సిన్హాకు అమెరికాకు చెందిన అమెరికన్ హెలికాప్టర్ సొసైటీ (ఏహెచ్ఎస్) ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఆయనకు ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ లీడర్షిప్ అవార్డును ప్రదానం చేసింది. హెలికాప్టర్ నిటారుగా గాల్లోకి ఎగరడంపై ఆయన పరిశోధన చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని హెలికాప్టర్ విభాగంలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో భారత సైన్యంలో మేనేజర్‌గా సియాచిన్‌లో విధులు నిర్వర్తించారు. సతారాలోని సైనిక్ స్కూలులో చదువుకున్నారు.
