టైటానిక్ ఉన్నికోటు రూ.1.4 కోట్లు
టైటానిక్ ఓడకు సంబంధించిన వస్తువులు అప్పుడప్పుడు బయటపడి మనకు ఆ విషాద జ్ఞాపకాలను గుర్తుచేశాయి. ఆ ఓడలో ప్రధాన ఉపచారిక మాబెల్ బెన్నెట్ ధరించిన ఉన్నికోటు ఒక వేలం పాటలో రూ.1.4 కోట్లకు అమ్ముడైందని బీబీసీ వరల్డ్ తెలిపింది. అయితే వేలం ఎక్కడ జరిగిందో పేర్కొనలేదు. బ్రిటన్ వాసి ఈ కోటును దక్కించుకున్నాడని తెలిపింది.
