యుఎస్ మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్
డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ అమెరికా మార్కెట్లో ప్రొజిస్టెరాన్ పేరుతో మరో జనరిక్ క్యాప్సూల్స్‌ను విడుదల చేసింది. స్త్రీల నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యల నివారణకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. అబ్వీ ప్రొడక్స్ ఎల్ఎల్సి అనే కంపెనీ ప్రొమెట్రియం అనే పేరుతో ఇదే ఔషధాన్ని బ్రాండెడ్ ఔషధంగా మార్కెట్ చేస్తోంది. గత 12 నెలల్లో అమెరికాలో ఈ ఔషధ అమ్మకలు 15.3 కోట్లు డాలర్ల వరకు ఉన్నాయి. ప్రొమెట్రియం క్యాప్సూల్స్‌కు ప్రత్యామ్నాయంగా జనరిక్ వెర్షన్లో 100 200 ఎంజి డోసెజ్లో ప్రొఇస్టెరాన్ పేరుతో విడుదుల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ బిఎస్ఇకి తెలిపింది. అమెరికా ఎఫ్‌డిఎ కూడా ఇందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.
