రాష్ట్రపతి భవన్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఘనస్వాగతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు భారత్ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్.. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జయశంకర్, హర్షవర్దన్ తదితరులు పాల్గొన్నారు.
