గూగుల్ కార్యాలయంలో రేవంత్
కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలోని గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సందర్శించారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. తెలంగాణలో టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్ సంస్థ ఉన్నతాధికారులతో తెలంగాణ బృందం చర్చలు జరిపింది. చర్చలు సానుకూలంగా జరిగినట్లు రేవంత్ వెల్లడించారు.
