నాసా కు ఎంపికైన హిమశ్రీ
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన చిలూకూరి హిమశ్రీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా లో పరిశోధనకు ఎంపికైంది. గ్రామానికి చెందిన చిలూకూరి నవీన్, సంధ్య దంపతుల కుమార్తె హిమశ్రీ హైదరాబాద్లోని కొంపెల్లి శ్రీచైతన్య పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. అనింధ పూర్వ ప్రాజెక్టుపై ఆరు నెలలు శ్రమించి తయారు చేసి, పంపిన నివేదికకు హిమశ్రీని నాసా అంతరిక్ష పరిశోధనల్లో పాల్గొనాలని తెలుపుతూ మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఈ ప్రాజెక్టుకు ఎంపికైన అరుగురు విద్యార్థుల్లో హిమశ్రీ ఒకరు. నాసాకు ఎంపికవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవకాశం రావడానికి పాఠశాల ప్రిన్సిపాల్ రాంబాబు కృషి ఎంతో ఉందని హిమశ్రీ తెలిపారు. హిమశ్రీని గ్రామ సర్పంచ్ రేగుంట భూమాయి, ఏఎన్ఎం కృష్ణవేణి, టీఆర్ఎస్ నాయకులు రేగుంట దేవేందర్, అవారి అశోక్, ఆకుల రమేష్ అభినందించారు.
