భద్రాచలం సీతారాముల కళ్యాణం
హ్యూస్టన్లో అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్ 29 నుంచి జూలై 1 వరకు జరిగే కార్యక్రమాల్లో భద్రాచలం దివ్యక్షేత్రంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఆటా తెలంగాణ మహాసభలకు వచ్చేవారి కోసం ఏర్పాటు చేశారు. ఇందుకోసం భద్రాచలం నుంచి విగ్రహాలను, పూజారులను ప్రత్యేకంగా రప్పిస్తున్నారు. స్వామివారి ప్రసాదాలను కూడా అక్కడ నుంచి తెప్పించి మహాసభలకు వచ్చినవారికి అందజేయనున్నారు.
