ఫ్లోరిడాలో ఆటా మహిళా దినోత్సవం
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా), జాక్సన్విల్లే తెలుగు సంఘం ఆధ్వర్యంలో జాక్సన్విల్లే, ఫ్లోరిడాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ఆధ్యంతం నృత్యాలు, పాటలు, చిన్న పిల్లలఫ్యాషన్‑ షో, యువతుల ఫ్యాషన్ షోలతో ఎంతగానో వీక్షకులను ఆకట్టుకుంది. మహిళా సమాజాన్ని ఉత్తేజపరుస్తూ, ఆలోచింపచేస్తూ సాగిన చర్చా కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆటా ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి పిల్లలకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.
