ATA: బాల్టిమోర్ ఆటా కన్వెన్షన్ సన్నాహాల వేగవంతం..
ఎల్లికాట్ సిటీలో కాన్ఫరెన్స్ ప్లానింగ్ టీమ్ సమావేశం
బాల్టిమోర్ వేదికగా జరగనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ సన్నాహాలను సమీక్షించేందుకు ప్లానింగ్ టీమ్ మేరీల్యాండ్‌లోని ఎల్లికాట్ సిటీలో సమావేశమైంది. ఈ మహాసభలు 2026, జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నాయి. ఈ ఇంటరాక్టివ్ సెషన్లో డెలావేర్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా మరియు వర్జీనియా రాష్ట్రాల నుండి సుమారు 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో దాదాపు 70 కమిటీల బాధ్యతలు, సమన్వయ వ్యూహాలు మరియు కాలక్రమ పట్టికలను క్షుణ్ణంగా సమీక్షించారు. కాన్ఫరెన్స్ కోర్ కమిటీ సభ్యులు ఈ సమావేశాన్ని నిర్వహించారు.
కమిటీల నియామకంపై చైర్ లు, కో చైర్ లు సభ్యులతో కూడిన డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శించి, వారి నుండి సలహాలను స్వీకరించారు. కమిటీల మధ్య సహకారాన్ని పెంపొందించడం మరియు పనుల అమలులో సమర్థతను పెంచడంపై చర్చించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు ఈ సమావేశం జరగడం విశేషం. ఇందులో మహిళా నాయకులు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని తమ నిబద్ధతను చాటుకున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రధాన కమిటీలు: అడ్వైజరీ, అవార్డ్స్, బ్యాంక్వెట్, బడ్జెట్, బిజినెస్ అండ్ స్టార్టప్స్, సిఎంఇ,హెల్త్, కార్పొరేట్ స్పాన్సర్షిప్, కల్చరల్, డెకరేషన్, ఫైనాన్స్, ఫిల్మ్ అండ్ ఫోటోగ్రఫీ, ఫుడ్, హాస్పిటాలిటీ, లిటరరీ, ఇమ్మిగ్రేషన్, ఎన్నారై, పొలిటికల్, స్పోర్ట్స్, ట్రాన్స్‌పోర్టేషన్, వెన్యూ, ఉమెన్ మరియు యూత్ వంటి పలు కీలక కమిటీలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ సమావేశంలోజయంత్ చల్లా (ప్రెసిడెంట్), శ్రీధర్ బనాలా (కన్వీనర్), శరత్ వేముల (నేషనల్ కోఆర్డినేటర్), రవి చల్లా (కోఆర్డినేటర్), సుధీర్ దామిడి (డైరెక్టర్), జీనత్ కుందూర్ (కో-కోఆర్డినేటర్), తిరుమల్ మునుకుంట్ల (కాన్ఫరెన్స్ ఏరియా కోఆర్డినేటర్), కౌశిక్ సామ (కో-నేషనల్ కోఆర్డినేటర్), మరియు కిరణ్ అల (కో-డైరెక్టర్)ýతోపాటు ట్రస్టీలు శ్రీనివాస్ దార్గుల (బడ్జెట్ చైర్), సంతోష్ రెడ్డి (అవార్డ్స్ చైర్) పాల్గొన్నారు. సమావేశ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించిన స్థానిక నిర్వాహకులు రాజి రెడ్డి, కృష్ణ రెడ్డి మరియు ఇతర వాలంటీర్లకు బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఇవి కూడా చదవండి
