2017లో రికార్డు ఉషోగ్రతలు
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల జాబితాలో 2017 కూడా చేరుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎన్నినో ప్రభావం బలహీన పడడమే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. 1980 నుంచి 90 దశకంలో బలమైన ఎన్నినోలు చోటుచేసుకోవడంతో తర్వాతి కాలంలో అవి బలహీనపడ్డాయని చెప్పారు. 1998 నుంచి 2013 వరకు భూతాపంలో ఏర్పడ్డ స్వల్ప విరామమే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మండిపోవడానికి మూల కారణమని తేల్చారు.
