Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Zebra movie trailer launched by megastar chiranjeevi

తప్పకుండా జీబ్రా సూపర్ హిట్ బొమ్మ అవుతుంది : మెగాస్టార్ చిరంజీవి  

  • Published By: techteam
  • November 13, 2024 / 07:43 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Zebra Movie Trailer Launched By Megastar Chiranjeevi

-మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన సత్య దేవ్, డాలీ ధనంజయ, ఈశ్వర్ కార్తీక్, పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ 'జీబ్రా' గ్రిప్పింగ్ ట్రైలర్‌  

Telugu Times Custom Ads

టాలెంటెడ్ హీరో సత్య దేవ్ (Satyadev), కన్నడ స్టార్ డాలీ ధనంజయ(Dolly Dhanjaya) హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా( Zebra). ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.

ట్రయిలర్ సినిమా ప్రధాన కథాంశాన్ని రివిల్ చేస్తోంది, ఇది వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది, బ్యాంకు ఫ్రాడ్ చుట్టూ తిరిగే కథాంశం. ఆర్థిక నేరాల డేంజరస్ వరల్డ్ లో చిక్కుకుంటాడు హీరో. రెస్పెక్ట్ అల్టిమేట కరెన్సీ అని భావించే రూత్ లెస్ గ్యాంగ్‌స్టర్ డాలీ నుంచి అతనికి పెద్ద ముప్పు ఉంటుంది. ఈ డేంజర్ నుండి తప్పించుకోవడానికి, హీరో,  ఫ్రెండ్స్ గ్యాంగ్ తీసుకున్న రిస్క్ ని ఎక్సయింటింగ్ గా ప్రజెంట్ చేస్తోంది.  

ఈ మూవీ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు రోమాన్స్, ఫన్ బ్లెండ్ ని అద్భుతంగా అందిస్తోంది. సత్యదేవ్ హీరోగా అదరగొట్టారు, విలన్ గా డాలీ ధనంజయ టెర్రిఫిక్ గా వున్నారు. సునీల్ పాత్రలో కూడా నెగెటివ్ షేడ్స్ వున్నాయి. సత్య  కామిక్ రిలీఫ్ అందించారు. సత్యదేవ్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. సత్యరాజ్ కూడా తనదైన ముద్ర వేశారు. ఈశ్వర్ కార్తీక్ బ్రిలియంట్ రైటింగ్మ  స్టైలిష్ టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. సత్య పొన్మార్ కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలిచింది, రవి బస్రూర్ తన ఎనర్జిటిక్ స్కోర్‌తో విజువల్స్‌ని ఎలివేట్ చేశాడు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్  గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, ఎడిటింగ్‌ని అనిల్ క్రిష్ ఎడిటర్ . టీజర్,  ప్రోమోలు సంచలనం సృష్టించగా, ట్రైలర్ వాటిని మరో స్థాయికి తీసుకెళ్లింది.

జీబ్రా మెగా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొన్ని ఫంక్షన్స్ కి రావడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ప్రేమతో పిలిస్తే వస్తాను. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. ఇక్కడ ఆ ప్రేమ అభిమానం మెండుగా లభిస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అంత ప్రేమ అభిమానం కురిపిస్తుంటే అది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుక ఇంత ఘనంగా జరగడానికి కారణమైన మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. కోవిడ్ సమయంలో ఎలాంటి సినిమాలు తీసి జనాలని రంజింపచేయాలనే ఒక మీమాంస ఇండస్ట్రీలో నెలకొంది. జనాలు ఓటీటీలో సినిమాలు చూడడం అలవాటు చేసుకున్న తర్వాత, పెద్ద సినిమాలకు, బిగ్ ఈవెంట్ సినిమాలి తప్పితే వాళ్ళని థియేటర్స్ కి రప్పించడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమైనప్పుడు ఇండస్ట్రీకి ఐడెమ్ కష్టకాలం అనిపించింది.

పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన అది ఇండస్ట్రీ కాదు, ఇక్కడ అన్ని సినిమాలు ఆడాలి, షూటింగ్ లు జరుపుకోవాలని, ఉపాధి కల్పించాలి,  ప్రతి ఒక్కరూ కళకళలాడాలి, అప్పుడే పరిశ్రమ సజావుగా కొనసాగుతూ ఉంటుందనే నాలాంటి వాళ్లకు ఒక చిన్న బెరుకు వచ్చింది. అయితే అవన్నీ కూడా కరెక్ట్ కాదని ప్రేక్షకులు నిరూపించారు. దానికి ఉదాహరణగా ఈ సంవత్సరం ప్రశాంత్ వర్మ, తేజసజ్జా కలయికలో హనుమాన్ తో శుభారంభమైంది. అది ఆల్ ఇండియా సినిమాగా గొప్ప విజయం సాధించింది. చిన్న సినిమాలని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. తర్వాత వచ్చిన కమిటీ కుర్రాళ్ళు, డిజె టిల్లు 3,  ఆయ్, మత్తువదలరా 2 ఇలా వరుసగా సినిమాలో సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. మొన్న దీపావళికి లక్కీ భాస్కర్, క, అమరన్  ఎంతో ఆదరణ పొందాయి. ఈరోజు కంటెంట్ ఆయుపట్టు. కంటెంట్ బాగుండాలి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అది ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సినిమాలు ఆడవు ప్రేక్షకులు ఓటీటికి అలవాటు పడిపోయారనే మాట అవాస్తవం.  సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు.  సినిమాని వాళ్ళకి మెప్పించేలా మనం చాకచక్యంగా తీయాలి.  

జీబ్రా ట్రైలర్ చూసినప్పుడు మంచి కంటెంట్ తో ఉందని అర్థమవుతుంది ఇందులో చాలా మంచి ఎంటర్టైన్మెంట్, స్టార్ కాస్ట్ ఉంది. వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు క్రైమ్ ఎలిమెంట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ బొమ్మ అవుతుంది. ఇందులో సత్య, ధనుంజయ, సత్యరాజ్ ఇలా చాలా మంచి నటులు ఉన్నారు. డాలీ తెలుగులో మంచి నటుడుగా స్థిరపడతాడని నమ్మకం ఉంది. సత్యదేవ్ నాకు ఇంకో తమ్ముడు. తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్మషం ఉండదు. నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను చెప్పినవన్నీ సత్యాలు. తన సినిమాలు చూస్తున్నప్పుడు చాలా ఇంటెన్సుగా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడు అనిపిస్తుంది. తన వాయిస్ లో రిచ్ నెస్ వుంది. తన మొదటి చూసినప్పుడు నేను తెలుగు యాక్టర్ అనుకోలేదు. కానీ తను మన వైజాగ్ అబ్బాయి తెలిసినప్పుడు తనతో మాట్లాడాలనుకున్నాను. అప్పుడే తను నేనంటే ఎంత ఇష్టమో చెప్పాడు.

అప్పటి నుంచి మేము అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. తను చాలా మంచి యాక్టర్. అయితే తనకి సరైన సినిమాలు పడటం లేదనిపించేది. గాడ్ ఫాదర్ లో  విలన్ రోల్ లో తను అత్యద్భుతంగా చేస్తాడాని నాకు నమ్మకం.  నేను నమ్మకం పెట్టుకున్నట్లే ఆ సినిమాలో అతను అద్భుతంగా రాణించాడు. ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సత్యదేవ్  లాంటి వెర్సటైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తనకి భవిష్యత్తులో బోలెడన్ని అవకాశాలు వస్తాయి. జీబ్రాలో తను చాలా షటిల్డ్ పెర్ఫార్మన్స్ తో చేశాడు. తనకి మరింత బ్రైట్ ఫ్యూచర్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. తమ్ముడు సత్యదేవ్ కి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. నిర్మాతలు బాల, దినేష్, ఎస్ ఎన్ రెడ్డి గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ చాలా వండర్ఫుల్ గా ఈ సినిమాను తీశారు. టీమ్ అందరికీ ఈ సినిమా అద్భుతమైన విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. టీం లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు.

హీరో సత్య దేవ్ మాట్లాడుతూ.. అన్నయ్య(మెగాస్టార్ చిరంజీవి) ఎదురుగా ఉన్నప్పుడు నా నోట మాట రావడం లేదు. నాలుగు రోజులుగా చాలా ప్రిపేర్ అయ్యాను. కానీ ఆయన్ని చూసిన తర్వాత నాకు మాటలు రావడం లేదు. అన్నయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో మా సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయిందని నమ్మకం వచ్చేసింది. చిన్నప్పుడు అన్నయ్య సినిమాలు చూసే ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఒక శిఖరంపై జెండా పాతారు. నాలాంటి ఎంతోమందికి ఆ జెండాను చూస్తున్నప్పుడు ఒక స్ఫూర్తి వస్తుంది. ఆ జెండాను చూసే శక్తి పుంజుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. అన్నయ్య తరతరాలు వీలునామా లేకుండా మారే ఆస్తి. ప్రతి జనరేషన్ చిరంజీవి అనే పేరుని సెలబ్రేట్ చేసుకుంటుంది. అన్నయ్యని నేను వందసార్లు కలిసి ఉంటాను. మనకి స్క్రీన్ మీద కనిపించే దాని కంటే 100 టైమ్స్ గొప్ప వ్యక్తి ఆయన. ఆయనే దగ్గర్నుంచి చూసే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది. ఇండియన్ సినిమాని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన అన్నయ్యకి థాంక్యూ సో మచ్. గాడ్ ఫాదర్ అనే సినిమా బిగ్గెస్ట్ హై ఇన్ మై లైఫ్. చిరంజీవి గారి సినిమాలో వీడు విలన్ ఏంటి? అని అందరూ నన్ను చూస్తున్న సమయంలో అన్నయ్య ఎంతో ప్రేమతో సెట్స్ లో 'సత్యా మై బాయ్' అని పిలిచేవారు. నిన్ను ఎవరూ నమ్మక్కర్లేదు నేను నమ్ముతున్నాను అన్నారు.

సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో చూడు అని చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక నా క్యారెక్టర్ గురించి అందరూ రాసినప్పుడు ఆయన ఫోన్ 'చేసి నేను నీకు చెప్పానా' అని అభినందించారు. చిరంజీవి గారి నమ్మకాన్ని నిలబెట్టాను. అది నాకు చాలా అనిపించింది. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు నన్ను పెట్టారనే నమ్మకంతోనే జీబ్రా నిర్మాతలు నాకు ఈ సినిమా ఇచ్చారు. ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. చాలా బిగ్ కాన్వాస్ తో ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి అన్నయ్య వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా నాకు డెబ్యు లాంటిది. ఇది అన్నయ్యకి డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్నయ్య చెప్పడం వల్లే గాడ్ ఫాదర్ లో క్యారెక్టర్ చేశాను. దాని వలనే నాకు ఈ సినిమా వచ్చింది. ఇకనుంచి ఒక కొత్త సత్యదేవ్ ని చూస్తారు. నా నుంచి బెస్ట్ ఫిలిమ్స్ వస్తాయి. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. నిర్మాతలు సపోర్ట్ ని మర్చిపోలేను. డైరెక్టర్ ఈ కథనే తీసుకొచ్చినందుకు తనకు రుణపడి ఉంటాను. ప్రశాంత్ కి థాంక్యూ.  రవి గారికి థాంక్యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'చెప్పారు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మన బాస్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్, మనందరి హనుమంతుడు, మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం. చిరంజీవి గారు హనుమాన్ సినిమాని హనుమంతుడు పర్వతం ఎత్తినట్లు ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారు. థాంక్యూ సో మచ్ చిరంజీవి గారు. ఒక టీం కష్టపడి వర్క్ చేస్తే ఆ టీం ని అభినందించడంలో, ప్రోత్సహించడంలో చిరంజీవి గారు ఎప్పుడు ముందుంటారు. వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు. జీబ్రా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.  సత్యదేవ్ నాకు ఎప్పటినుంచో తెలుసు. సినిమా అంటే తనకి పాషన్. సత్యదేవ్ కోసం, డైరెక్టర్ కోసం, నిర్మాతల కోసం ఈ సినిమా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందరూ ఈ సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను'అన్నారు.

కన్నడ స్టార్ డాలీ ధనంజయ మాట్లాడుతూ.. స్నేహ జీవి చిరంజీవి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలకు వచ్చాను. అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు వచ్చాను. ఏదైనా ఒక వైఫల్యం వచ్చినప్పుడు స్ఫూర్తినిచ్చే ఒక వ్యక్తి కావాలి. ఎవరి ప్రయాణమైనా మనల్ని మనకు స్ఫూర్తినివ్వాలి.  నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన ప్రయాణం చిరంజీవి గారిది. చిరంజీవి గారు గ్రేట్ ఇన్స్పిరేషన్. ఈ ప్రాజెక్టుకి నన్ను రిఫర్ చేసిన మై బ్రదర్ సత్యదేవ్ కి థాంక్యూ. చిరంజీవి గారిని ఈ వేడుకలో కలవడం చాలా ఆనందంగా ఉంది. వాల్తేరు వీరయ్య లో బాబీ చేసిన క్యారెక్టర్ ని నేను చేయాల్సింది. కానీ మిస్ అయ్యాను. చిరంజీవి గారి ఆశీర్వాదం మా సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నాను. కన్నడలో నీకు శివన్న ఎలాగో తెలుగులో నాకు చిరంజీవి గారు అలా అని సత్య  నాకు చాలా సార్లు చెప్పాడు. ప్రతిభని ఇంత అద్భుతంగా ప్రోత్సహిస్తున్న చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. డైరెక్టర్ ప్రశాంత్గారికి థాంక్యూ. ఆయన హనుమాన్ సినిమా ఎంతగానో నచ్చింది. ఆయన  నుంచి అద్భుతమైన సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు అందరికీ థాంక్యూ. జిబ్రా కంప్లీట్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ డెఫినెట్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లోనే చూడండి. థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా ఇది. పుష్ప తర్వాత నన్ను మన జాలి రెడ్డి అంటున్నారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. మరిన్ని ప్రొజెక్ట్స్ ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ముందుగా మా బాస్ చిరంజీవి గారికి నమస్కారం. సత్యదేవ్, డాలీ .. ఇద్దరూ హైలీ టాలెంటెడ్. ఇద్దరు కలిసి చేసిన సినిమా అద్భుతంగా ఉంటుందని నమ్మకం ఉంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. పెద్ద సినిమాలా అనిపిస్తోంది. చిరంజీవి గారు మా నిర్మాణంలో రంగస్థలం, ఉప్పెన ఈ రెండు వేడుకలకి వచ్చారు. ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి . ఆ గుడ్ లక్ జీబ్రాకి కూడా వచ్చి సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు.  

డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి జగదీక వీరుడు అతిలోకసుందరి, రుద్రవీణ.. ఈ రెండు సినిమాలన్నీ డిఫరెంట్ ఏజెస్ లో  చూశాను. ఈ రెండు సినిమాలు కూడా నాకు డిఫరెంట్ గా ఇంపాక్ట్ చేశాయి . అప్పుడే సినిమా పవర్, యాక్టింగ్ పవర్ తెలిసింది. చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. ఇంత యూనిక్ స్టొరీ ని నమ్మి ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలకు థాంక్యూ సో మచ్. సత్య ఎంతగానో సపోర్ట్ చేశారు. సత్య కారణంగా డాలీ అనే మరో ఫ్రెండ్ దొరికారు. ఇద్దరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆడియన్స్ ని మా మైండ్లో పెట్టుకుని రాసిన కథ ఇది. ఆడియన్స్ ఇచ్చిన సలహాలు, సూచనలే నన్ను డైరెక్టర్ గా తీర్చిదిద్దుతాయి.  ఆడియన్స్ కి చాలా మంచి ప్రోడక్ట్ ని అందిస్తున్నామని నమ్మకం ఉంది. ఫస్ట్ ప్రైమ్ నుంచి చివరి వరకు ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా చాలా ఎంగేజింగ్ ఉంటుంది. లాస్ట్ 40 మినిట్స్ సీట్ ఎడ్జ్ లో ఉంటారు. అది మాత్రం చాలా నమ్మకంగా చెప్తున్నాను. మీ అందరి సపోర్టు కావాలి. అందరూ  సపోర్ట్ చేస్తారని నమ్మకం మాకుంది. అందరికీ థాంక్యు' అన్నారు.

నిర్మాత ఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఈ సినిమా కథ నచ్చే ఎంతో ఇష్టంగా చేయడం జరిగింది. ఈశ్వర్, మా హీరోలు అందరూ సపోర్ట్ చేశారు. కంటెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. మా కోరిక మేరకు ఇక్కడికి వచ్చిన మెగాస్టార్ గారికి ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటూ ఎంతో అభిమానించాం. స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆయన్ని ఇలా నేరుగా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. థాంక్యూ సో మచ్ చిరంజీవి గారు. నాకు సినిమాలు అంటే పాషన్.  దానితోని ఇండస్ట్రీకి రావడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను' అన్నారు

నిర్మాత దినేష్ సుందరం మాట్లాడుతూ.. చిరంజీవి గారు అన్ని సినిమాలన్నీ సపోర్ట్ చేస్తారు. చిరంజీవి గారు వరల్డ్ లోనే బిగ్ స్టార్. ఈ వేడుకకి ఆ దేవుడే చిరంజీవి గారిని పంపించారని మేము అనుకుంటున్నాం. ఈ వేడుకకు వచ్చిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్  మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. జీబ్రా కూడా చాలా మంచి కంటెంట్. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం' అన్నారు

నిర్మాత బాలసుందరం మాట్లాడుతూ.. మెగాస్టార్ గారికి థాంక్యూ సో మచ్. మెగాస్టార్ వలన మా హిట్ సినిమా బిగ్గర్ హిట్ సినిమా అవుతుంది. ఈశ్వర్ ఈ కథ చెప్పినప్పుడే ఇమ్మీడియేట్ గా చేయాలని ఫిక్స్ అయ్యాం.  ఇది రెగ్యులర్ సినిమా కాదు.  ఈ సినిమా చూసినప్పుడు జీబ్రా ఎలాంటి సినిమానో మీకు అర్థమవుతుంది. రైటింగ్ డైరెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నవంబర్ 22న మీరందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని స్ట్రైట్ సినిమాగా తీసుకొస్తున్నాం. మంచి కంటెంట్ ఎక్కడున్నా తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు.  జిబ్రాని తెలుగు ఆడియన్స్ సెలబ్రేట్ చేస్తారని నమ్మకం ఉంది. ఈ సినిమాని హిట్ చేసి మళ్లీ ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా చేసే కాన్ఫిడెన్స్ ని ఇస్తారనే భావిస్తున్నాం' అన్నారు.

జెన్నిఫర్ పిషినాటో మాట్లాడుతూ..  ఈ సినిమాని మీ అందరికీ చూపించడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ సో మచ్. ఆయనని కలవడం గొప్ప ఆనందం ఇచ్చింది. మా దర్శక నిర్మాతలకు, టీంలో అందరికీ థాంక్యు సో మచ్. 22న ఈ సినిమాని అందరూ చూసి బిగ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను'అన్నారు

అమృత అయ్యంగార్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇది నా మొదటి డైరెక్ట్ తెలుగు ఫిలిం. మన ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది . చిరంజీవి గారి సినిమాలన్నీ కన్నడలో మేము సెలబ్రేట్ చేసుకుంటాం. జీబ్రాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్యూ సో మచ్. సత్యదేవ్ గారు, ధనుంజయ్  గారు ఒక ఫ్యామిలీ లానే చూసుకున్నారు. 22న జీబ్రా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్లో చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను'అన్నారు

డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సత్య సినిమాకి ఇలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సత్యకి ఒక అవకాశం వస్తే చాలా పట్టుదలతో దాన్ని సాధిస్తాడు.  డాలీ గారు కనడ వెర్షన్ కేరాఫ్ కంచరపాలెం లో మోస్ట్ సెలబ్రేట్ రోల్ చేశారు. ఆయన సినిమాలన్నీ చూసి ఎంజాయ్ చేస్తుంటాం. నిర్మత ఎస్ఎన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఈ సినిమాని తెరమీదకి తీసుకురావడానికి నిర్మాతల చేసిన కృషికి  హ్యాట్సాఫ్. మీలాంటి ప్రొడ్యూసర్స్ మా అందరికి దొరకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈశ్వర్ కార్తీక్ ఫిలిం మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా ఆల్రెడీ పెద్ద హిట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.  టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సత్యదేవ్ మన ఇంట్లో మనిషి లాంటివాడు. ఆడియన్స్  అందరూ కదిలిచ్చి థియేటర్స్లో జీబ్రా సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. చిరంజీవి గారు బ్లెస్సింగ్ తో ఈ సినిమా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు' అన్నారు.

లిరిక్ రైటర్ పూర్ణా చారి మాట్లాడుతూ.. ఇందులో ఆరు పాటలు రాశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్ యూ. రవి బస్రూర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో నేను పార్ట్ అవ్వడం ఆనందంగా వుంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

ఎడిటర్ అనిల్ క్రిష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి పని చేయడం మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమాని ఎడిట్ చేయడం అంత ఈజీ కాదు. చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే వున్న సినిమా ఇది. విజువల్ గా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. దర్శక నిర్మాతలకు థాంక్ యూ. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను' అన్నారు.

డీవోపీ సత్య పొన్మార్ మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు థాంక్ యూ. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ అద్భుతంగా ఈ కథని రాశారు. ఇందులోని నటీనటులు తమ పాత్రలో ఒదిగిపోయారు. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ అందరినీ అలరిస్తుంది' అన్నారు.
 

 

 

 

Tags
  • Chiranjeevi
  • Priya Bhavani Sankar
  • Satya Dev
  • Zebra

Related News

  • Article On Megastar Chiranjeevi

    Chiranjeevi: అందరివాడు చిరంజీవి..! విమర్శలు – పొగడ్తలు..!!

  • Aishwarya Rajesh In Fashion Dress

    Aishwarya Rajesh: ఫ్యాష‌న్ డ్రెస్ లో తెలుగమ్మాయి

  • Raja Saab Trailer Release

    Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్

  • Gatha Vaibhava Teaser Release

    Gatha Vaibhava: ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ఎపిక్ ఫాంటసీ డ్రామా “గత వైభవ” టీజర్ రిలీజ్

  • Madonna Sebastian In Spirit

    Spirit: స్పిరిట్ లో మ‌ల‌యాళ భామ‌?

  • Sudugali Sudheer Hilesso Movie Pooja Ceremony

    Hilesso: సుధీర్ ఆనంద్ “హైలెస్సో” గ్రాండ్‌గా లాంచ్- ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టిన వివి వినాయక్

Latest News
  • Prasant Kishor: 2 గంటల్లో 11 కోట్లు..! దటీజ్ ప్రశాంత్ కిశోర్..!!
  • VVPB: హ్యూస్టన్‌ లో ఘనంగా విశ్వవేద పారాయణ వార్షికోత్సవం.. 500మందికి పైగా పాల్గొన్న భక్తులు
  • H1B Visa: కొత్తగా హెచ్-1 బికోసం దరఖాస్తు దారులకు మాత్రమే లక్షడాలర్ల ఫీజు.. అమెరికా నిపుణుల క్లారిటీ..
  • Midhun Reddy: మిధున్ రెడ్డికి బెయిల్.. అసలేం జరిగింది..?
  • Vangalapudi Anitha: తాటి చెట్లతో పాయకరావుపేట మత్స్యకారుల వినూత్న నిరసన.. కంగుతిన్న హోమ్ మినిస్టర్..
  • Chandrababu: ఒకేసారి హస్తినలో తండ్రీ–కొడుకులు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన టూర్..
  • Chinta Mohan: కూటమికి చింత కలిగిస్తున్న చింతా మోహన్ ఫ్యాక్ట్ షీట్..
  • AP Volunteers: అప్పుడు జగనన్న సైనికులు.. ఇప్పుడు వైసీపీకి శత్రువులు..
  • Chandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..
  • Chandrababu: గత ప్రభుత్వం ట్రూఅప్‌ … కూటమి ప్రభుత్వం ట్రూడౌన్‌తో
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer