Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” (Raja Saab) ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ కోసం రెబల్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్ కు తెరదించుతూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో “రాజా సాబ్” ట్రైలర్ పండుగ ఫీస్ట్ ను అందిస్తూ రిలీజైంది. ఫన్, ఫియర్ తో పాటు వింటేజ్ ప్రభాస్ ను ఆల్ట్రా స్టైలిష్ గా చూపించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ను ఒక హిప్నాటిస్ట్ ఓ భారీ హవేలీలోకి తీసుకెళ్తడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అక్కడ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. దానికి కారణం తాత (సంజయ్ దత్). సైకలాజికల్ గా అన్ని విద్యలు తెలిసి, ప్రేతాత్మలను నియంత్రిస్తూ బ్రెయిన్ తో గేమ్ ఆడుకునే ఆ తాత శక్తిని ఎదుర్కోవడం ఆసాధ్యం.
‘అభీ దేఖ్ లీజియో…’ అంటూ ఆ దుష్టశక్తిని ఎదుర్కొనేందుకు రాజా సాబ్ గా హవేలీలోకి అడుగుపెడతాడు ప్రభాస్. రాజా సాబ్ లుక్ లో ప్రభాస్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ వన్స్ మోర్ అనేలా ఉంది. హవేలీలో జరిగిన ప్రతి ఘటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా పిక్చరైజ్ చేశారు దర్శకుడు మారుతి. మొసలితో ప్రభాస్ చేసిన ఫైట్, దుష్టశక్తులతో పోరాడే తీరు ట్రైలర్ లో హైలైట్ గా నిలుస్తోంది. ఈ హారర్ ఎలిమెంట్స్ తో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్స్ తో ప్రభాస్ చేసిన ఫన్, రొమాంటిక్ సీన్స్ మరో ఆకర్షణగా మారాయి.
“రాజా సాబ్” ట్రైలర్ లోని హై టెక్నికల్ వ్యాల్యూస్, సీజీ వర్క్స్ ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంత అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మించిందో చూపిస్తున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తను ప్రామిస్ చేసినట్లే రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో వింటేజ్ ప్రభాస్ తో ఒక ఫుల్ మీల్స్ లాంటి మూవీని హోస్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించినట్లు ట్రైలర్ ప్రూవ్ చేస్తోంది. వచ్చే సంక్రాంతి పండక్కి జనవరి 9న “రాజా సాబ్” వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త రికార్డులు సృష్టించబోతున్నారు.