మరో వివాదంలో అమలాపాల్
అమలాపాల్ అంటేనే వివాదాలు అనేలా మారింది పరిస్థితి. ఇప్పటికే పలు సంచలనాలు రేపిన ఈ అమ్మడు తాజాగా మరో సంచలనం రేపి వివాదాల్లో ఇరుక్కుంది. ఆ వివరాల్లోకి వెళితే, తాజాగా అమలాపాల్ ఓ హాట్ యోగా ఫొటోలు విడుదలయ్యాయి. ఈ యోగా ఫొటోల్లో ఓ గోడపై బుద్ధుడి బొమ్మ ఉంది. ఆ గోడకు అమలాపాల్ శీర్షాసనం వేసింది. అయితే ఆమె కాళ్ళు బుద్ధుడి ముఖానికి తాకుతున్నాయి. దీంతో బుద్ధుని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆమెపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అమలాపాల్‌కు అంత బలుపా. దేవుడి ఫొటో ఉందన్న కామన్సెన్స్ కూడా లేదా అని ఫైర్ అవుతున్నారు. వెంటనే ఫొటోలు తొలగించాలని, అంతే కాకుండా క్షమాపణలు కూడా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయినా అమలాపాల్ ఈ ఫొటోలను ఇంకా డిలీట్ చేయలేదు. మరి ఈ విషయంపై వారు ఇంకెలా స్పందిస్తారో చూడాలి.
