మెగాస్టార్ ఇంట్లో సంబరాలు
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని చాలామంది పోటీపడ్డారు. కానీ ఆ అవకాశం రామ్‌చరణ్‌కే దక్కింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించి ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని రూపొందించారు. చరణ్‌కి నిర్మాతగా తొలి అడుగులోనే విజయం అందింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఏర్పాటై ఏప్రిల్ 30తో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తొలి వార్షికోత్సవ సబంరాలు హైదరాబాద్‌లో చిరంజీవి ఇంట ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి తన ఆనందాన్ని పంచుకొన్నారు చిరు. చిరంజీవి 151వ చిత్రం కూడా కొణిదెల సంస్థలోనే ఉండబోతోంది. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. మా సంస్థలో పనిచేయబోతున్న సురేందర్‌రెడ్డి స్వాగతం అంటు ఆహ్వానించారు చరణ్.
