కాలినడకన తిరుమలకు రకుల్
ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్, మంచు లక్ష్మి దంపతులు మంగళవారం రాత్రి తిరుమల వచ్చారు. శ్రీవారిమెట్టు మార్గం నుంచి బయలుదేరిన వీరు తిరుమలలోని జీఎంఆర్ అతిథి గృహానికి చేరుకున్నారు. దారి పొడవునా వీరిని చూడటానికి పలువురు ఉత్సాహం చూపారు. వారితో కలిసి ఫొటోలు తీసుకున్నారు. నేడు ఉదయం ఈ ముగ్గురూ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
