ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినే
నేను నటించిన సినిమా బాగా ఆడిందంటే ఆ విజయంలో నేను అడక్కుండానే నాకు భాగం అందుతుంది. పరాజయం పాలైతే, ఆ ఓటమిలో నాకు వాటా ఉన్నట్లే అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఆమె మహేష్‌బాబు మురుగుదాస్‌ల చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ నా కేరీర్లో విజయాలు ఉన్నాయి, పరాజయాలు ఉన్నాయి. రెండిటినీ సమానంగానే స్వీకరించా. కానీ దేన్నీ తలకెక్కించుకోలేదు. సాధారణంగా ఓటమి బాధిస్తుంటుంది. ఆ సినిమా ఎందుకు చేశానో అనే భావన వెంటాడుతుంది. కొనిన కొన్ని సార్లు నాకు నప్పని పాత్రల్ని ఎంచుకోవాల్సి వస్తుంది అది ముమ్మాటికీ నా తప్పే. అలాంటి సినిమాలు బాగా ఆడినా ఏమాత్రం సంతృప్తి ఉండదు. ఓటమిని త్వరగా మర్చిపోయే గుణం నాకుంది. దానికి కారణం ఏమాత్రం విరామం లేకుండా సినిమాలు చేయడమే. జయాపజయాలతో సంబంధం లేకుండా నాకు అవకాశాలొస్తున్నాయి. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినే అంది.
