Rakasa: సమ్మర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘రాకాస’- నిహారిక కొణిదెల
ఏప్రిల్ 3న వస్తోన్న ‘రాకాస’లో 100% ఎంటర్టైన్మెంట్ పక్కా..ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సంగీత్ శోభన్
నిహారిక.. జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో మేకర్స్ బుధవారం రోజున మదనపల్లిలోని ఎంఐటీఎస్ కాలేజ్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిహారిక కొణిదెల, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
ఎంఐటీఎస్ వైస్ ఛాన్సలర్ యువరాజ్ మాట్లాడుతూ ‘‘రాకాస సినిమాను ప్రమోట్ చేయటానికి ఇక్కడకు వచ్చిన నిర్మాత నిహారికగారికి, హీరో సంగీత్ శోభన్గారికి, హీరోయిన్ నయన్ సారిక, గెటప్ శ్రీను గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని కోరుకుంటు్న్నాను. మా కాలేజ్ తరపున ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.
లక్ష్మీ నరసింహ మూవీస్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చాలా బావుంది. దీని కంటే పది రెట్లు అలరించేలా రేపు సినిమా ఉండబోతోంది. కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్ అన్నీ అలరిస్తాయి. మనం చిన్నప్పుడు కథలు వినే వాళ్లం.. అలాంటి కథలా మెప్పించేలా సినిమా ఉంటుంది. ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన మన్యం రమేష్‌గారికి, నిహారిక కొణిదెలగారికి థాంక్స్’’ అన్నారు.
ఇవి కూడా చదవండి
గెటప్ శ్రీను మాట్లాడుతూ ‘‘ఎంఐటీఎస్లో మా రాకాస మూవీ ట్రైలర్ రిలీజ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 3న మా మూవీ రిలీజ్ కానుంది. ప్రేక్షకులను మెప్పించే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయి. ఫాంటసీ, కామెడీ, ఎమోషన్‌తో పాటు వీరబాబు పాత్రలో సంగీత్ శోభన్ ఉంటాడు. తనతో పాటు నేను కూడా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను. మానస శర్మగారు సినిమాకు రైటర్‌గానూ, డైరెక్టర్‌గానూ మెప్పించబోతున్నారు. చాలా మంచి కథను రాసుకోవటంతో పాటు చక్కగానూ డైరెక్ట్ చేశారు. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ, అనుదీప్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఈ సినిమా ఇంత బాగా రావటానికి కారణం మా నిర్మాత నిహారికగారు. టీమ్‌కు కావాల్సిన వనరులను ఆమె చక్కగా అందించటం వల్ల సినిమాను చక్కగా పూర్తి చేయగలిగాం. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ ‘‘మదనపల్లికి రావటం ఇదే ఫస్ట్ టైమ్. ఇక్కడే ఎంఐటీఎస్లో రాకాస ట్రైలర్ లాంచ్ చేయటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. అందరికీ ట్రైలర్ నచ్చే ఉంటుంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు
హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘‘ఇక్కడకు వచ్చిన క్రౌడ్‌ను చూస్తుంటే మామూలు ఎనర్జీగా లేదు. అనధికారికంగా ఇది మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లాగానే భావిస్తున్నాం. మీ అందరికీ డీడీగా బాగా కనెక్ట్ అయ్యాను. ఈసారి మరో వెన్నెలతో మీ ముందుకు వస్తున్నా. రాకాస మూవీని ఏడాది క్రితం స్టార్ట్ చేశాం. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ను ఎంజాయ్ చేశారు. రాకాస సినిమా ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఇందులో ఏదైతే ఫన్, ఫాంటసీ, ఎంటర్టైన్మెంట్ని చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారో.. అంత కంటే వంద రెట్లు సినిమాలో ఉంటుంది. నాది గ్యారంటీ. నా సినిమాలో ఎప్పుడు మెసేజ్‌లు ఉండవు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది. గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 3న మా రాకాస మూవీ రిలీజ్ కానుంది..100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ పక్కా. మాకు సపోర్ట్ చేసిన కాలేజీ యాజమాన్యానికి, ఎంటైర్ టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మదనపల్లిలోని ఎంఐటీ కాలేజ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయటం చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, లేటెస్ట్గా వచ్చిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 3న రాకాస మూవీతో మీ ముందుకు వస్తున్నాం. థియేటర్స్‌కు వచ్చి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సమ్మర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది’’.
ఇవి కూడా చదవండి
