రాకా కోసం లాంగ్ వెయిటింగ్ తప్పేలే లేదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్గా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ సినిమా రాకా(raaka)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టైలిష్ మేకోవర్స్, విభిన్న కథలతో పేరుగాంచిన బన్నీ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మేర షూటింగ్ పూర్తయినా, సినిమా స్కేల్ దృష్ట్యా మిగిలిన భాగాలు భారీ స్థాయిలో తెరకెక్కించాల్సి ఉన్నట్టు సమాచారం.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ మరింత సమయం కేటాయించాల్సి రావొచ్చని టాక్ వినిపిస్తోంది. మొదట అనుకున్న షెడ్యూల్స్ కంటే ప్రొడక్షన్ పనులు విస్తరించడంతో షూటింగ్ గడువు పెరిగినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ సెట్స్ కారణంగా ప్లానింగ్ మారినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా పూర్తి కావడానికి ఇంకా గణనీయమైన సమయం పడొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామం మరో కీలక అంశాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశముంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(LOkesh kanagaraj)తో బన్నీ(Bunny) చేయనున్న తదుపరి ప్రాజెక్ట్ టైమ్‌లైన్ కూడా ఈ కారణంగా మారవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం అంతా ఊహాగానాల పరిధిలోనే ఉంది. త్వరలో మేకర్స్ నుంచి స్పష్టత వస్తుందేమో చూడాలి.
