బాలీవుడ్‌కు దూరం కాదట..
పొడుగుకాళ్ళ సుందరి ప్రియాకం చోప్రా బాలీవుడ్ హాట్ నాయిక. నిత్యం అమె వార్తల్లో ఉంటుంది. దశాబ్దంకు పైగా స్టార్డమ్ అనుభవిస్తున్న ప్రియాంక హాలీవుడ్ వైపు కూడా దృష్టి సారించిన విషయం తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ క్యాంటికో ద్వారా ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బేవాచ్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తోంది. హాలీవుడ్లో నటిస్తున్న కారణంగా ఆమె హిందీ చిత్రాలకు దూరమైందనే ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రియాంకను సంప్రదించాలా వద్ద అనే మీమాంశలో కొందరు దర్శక, నిర్మాతలు ఉన్నారు. అయితే దీనిపై ఇటీవల క్లారిటీ ఇచ్చింది ప్రియాంక. తనను కొందరు నిర్మాతలు కలిశారని, న్యూయార్క్ వచ్చి కథలు వినిపించారని చెప్పింది. విన్న కథల్లో కొన్ని నచ్చాయని కూడా తెలిపింది. అయితే వీటికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటోంది. టీవీ సీరిస్‌పై మరింత సృష్టత వచ్చాకే హిందీ చిత్రాలు అంగీకరిస్తానని తెలిపింది. బాలీవుడ్ దూరం కానని మాత్రం తేల్చి చెప్పింది. సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం మూడు హిందీ చిత్రాల్లో నటించడానికి ప్రియాకం అంగీకరించింది. వాటి పేర్లు దర్శకులెవరే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తోంది. ప్రియాంక వంటి స్టార్ హిందీ చిత్రాలకు దూరం కావడం పట్ల అమె అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
