Pooja Hegde: రెడ్ శారీలో అదిరిపోయే లుక్ లో బుట్టబొమ్మ
పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒక లైలా కోసం(Oka Laila Kosam) మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా, ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిన పూజా ఈ ఇయర్ దేవా(Deva), రెట్రో(Retro) అనే సినిమాలు చేసినప్పటికీ ఆ రెండూ నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం విజయ్(Vijay) సరసన జన నాయగన్(Jana Nayagan) మూవీ చేసిన పూజా ఆ సినిమా ఆడియో లాంచ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తాజాగా ఆ ఫోటోలను పూజా తన ఇన్స్టాలో షేర్ చేయగా, ఆ ఫోటోల్లో బుట్ట బొమ్మ అందాలు చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. రెడ్ కలర్ శారీలో దానికి తగ్గ జ్యుయలరీ ధరించి ఎంతో గ్రాండ్ గా కనిపించిన పూజా ఈ ఫోటోల్లో తన కళ్లతోనే అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. పూజా షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.






