Revanth Reddy: అసెంబ్లీ నుంచి వెంటనే ఎందుకు వెళ్లారో ఆయన్నే అడగాలి : సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ను (KCR) అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి సభ్యుడిని మేం గౌరవిస్తాం. కేసీఆర్ను ఇవాళే కాదు, ఆస్పత్రి (Hospital)లో కూడా కలిశా. అసెంబ్లీ (Assembly) నుంచి వెంటనే ఎందుకు వెళ్లారో ఆయన్నే అడగాలి అని రేవంత్ అన్నారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, మేమిద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం? అని సీఎం వ్యాఖ్యానించారు. శాసనసభ ప్రారంభమైన తర్వాత కేసీఆర్ వద్దకు రేవంత్ వెళ్లారు. కరచాలనం చేస్తూ బాగున్నారా అని సీఎం పలకరించారు.






