TANA: తానా ఫౌండేషన్ చైర్మన్ గా ప్రసాద్ నల్లూరి, కార్యదర్శిగా భక్తబల్లా
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ఫౌండేషన్ కు కార్యవర్గం ఏర్పాటైంది. ఫౌండేషన్ చైర్మన్ గా ప్రసాద్ నల్లూరి, కార్యదర్శిగా భక్తబల్లా, ట్రజరర్ గా ఓరుగంటి శ్రీనివాస్ ను ట్రస్టీలు ఎన్నుకున్నారు. తానాలో ముఖ్యవిభాగంలో ఒకటైన ఫౌండేషన్ కు డిసెంబర్ 31లోగా చైర్మన్, ఇతర పదవులను భర్తీ చేస్తామని చెప్పినట్లుగానే తానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి తన మాటను నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నిక ద్వారా ఇప్పుడు ఫౌండేషన్ అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కార్యక్రమాలను చేపట్టనున్నది. ఈ పదవులకోసం తానాలో ఇరువర్గాలు పట్టుబట్టడంతో చివరకు మధ్యేమార్గం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని నరేన్ కొడాలి అందించారు. ఫౌండేషన్ కు పూర్తిస్థాయి నాయకత్వం ఏర్పడటం పట్ల తానా సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.






