Modi: బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మోడీ సర్కార్ స్కెచ్..?
అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడ్డారు బంగ్లా దేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద యూనస్. పాకిస్తాన్, చైనా సహకారం చూసుకుని.. ఇండియాపై ఒంటికాలిపై లేచారు. పనిలో పనిగా ఇంక్విలాబ్ మోంచా నేత ఉస్మాన్ హాదీని హత్య చేయించి.. ఆ నెపాన్ని ఇండియాపై మోపాలని స్కెచ్చేశారు. అయితే రోజులు అన్ని ఒకలా ఉండవు కదా.. పరిస్థితులు తిరగబడుతున్నాయి. హాదీ హత్య వెనక ఉన్నది ఇండియా కాదని.. యూనస్ సర్కార్ లోని ఓ వర్గమే అని సాక్షాతూ మృతుడి సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు.అంతేకాదు.. నిందితులను శిక్షించకుంటే.. త్వరలోనే యూనస్ కూడా వేరే దేశానికి పారిపోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశాడు కూడా.
పక్కనే చిట్టెలుక లాంటి బంగ్లాదేశ్ అంతంత మాటలు అంటున్నా మోడీ నేతృత్వంలోని భారత్… సహనంగా వెయిట్ చేసింది. సమయం రానే వచ్చింది. ఇప్పుడు భారత్ కు.. బీఎన్పీ నేత తారిక్ రెహ్మాన్ రూపంలో సరైన పార్టనర్ దొరికాడు. ఆయనకు ఇండియా మద్దతు కావాలి.. భారత్ కు యూనస్ సర్కార్ కు చెక్ చెప్పే లీడర్ కావాలి.. పరస్పరం సహకారం దిశగా అడుగులు పడుతున్నాయి. తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ ఇప్పుడు.. బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది.
బంగ్లాదేశ్ లో కీలక పార్టీలుగా అవామీలీగ్, బీఎన్పీ, జమాతే ఇస్లామీలను చెప్పుకోవచ్చు. ఇందులో బీఎన్పీ, అవామీలీగ్ కు చెందిన నేతలు.. ప్రధానులుగా సైతం పనిచేశారు. వీరిలో అవామీలీగ్ నేత షేక్ హసీనా ప్రస్తుతం .. ఇండియాలో తలదాచుకుంటున్నారు. జమాతే ఇస్లామీ.. పూర్తిగా ఇండియా, హిందూ వ్యతిరేకపార్టీ. ఆపార్టీతో .. భారత్ కు పొత్తు పొసగదు. దీంతో బీఎన్పీతో సంబందాలు మెరుగుపరుచుకుంటోంది. ఇప్పుడా పార్టీ కనుక ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే.. ఢాకా-ఢిల్లీ బంధాలు ధృడపడతాయి.
మరోవైపు.. అధికారం పోతే.. యూనస్ పరిస్థితి హసీనాలాగే మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే… అవామీలీగ్ నేతలు, కార్యకర్తలపై దాడులు.. హిందువులపై హింస సహా కీలక విషయాల్లో యూనస్ సర్కార్ దోషిగా ఉంది.దీంతో అధికారం చేజారితే.. యూనస్ సైతం పొరుగుదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితులున్నాయి. దీనికి తోడు అమెరికా, రష్యా సైతం.. భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని.. బంగ్లాదేశ్ కు సూచిస్తున్నాయి. కానీ.. పాకిస్తాన్, చైనా మాత్రం ఆదిశగా అడుగులు పడనీయడం లేదు. దీంతో ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది యూనస్ సర్కార్ పరిస్థితి అంటున్నారు దౌత్య నిపుణులు.






