Rukmini Vasanth: రుక్మిణికి మరో బంపరాఫర్
2019లో బీర్బల్(birbal) అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రుక్మిణి వసంత్(rukmini vasanth) గురించి అందరికీ తెలుసు. సప్త సాగరాలు దాటి(sapta sagaralu daati) సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న రుక్మిణి ఆ సినిమాతో కేవలం కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీతో టాలీవుడ్ డెబ్యూ చేసింది కానీ ఆ సినిమా అమ్మడికి నిరాశనే మిగిల్చింది.
ఆ తర్వాత బఘీరా(bagheera), భైరతి రంగల్(Bhairathi Rangal), ఏస్(Ace) లాంటి సినిమాలు చేసినా అవేవీ అమ్మడిని సంతృప్తి పరచలేదు. రీసెంట్ గా కాంతార చాప్టర్1(kanthara1)లో నటించి తన యాక్టింగ్ తో మెప్పించడంతో పాటూ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న రుక్మిణి చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒకటి యష్(Yash) మూవీ టాక్సిక్(Toxic) కాగా, మరోటి ఎన్టీఆర్(NTR)- నీల్(Neel) కాంబోలో వస్తున్న సినిమా.
ఇవి కాకుండా రుక్మిణికి ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా సుకుమార్(sukumar) దర్శకత్వంలో రానున్న సినిమాలో రుక్మిణి నటించనుందని వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన సుకుమార్, రుక్మిణిని హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.






