Trump-Zelensky: ట్రంప్‌తో జెలెన్స్కీ భేటీ సారాంశం ఏమిటంటే..?
ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఫ్లోరిడా పామ్‌బీచ్‌లోని ఆయన నివాసమైన ‘మార్-ఎ-లాగో’లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. యుద్ధం ముగింపు కోసం ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చించారు.
అంతకుముందు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. సంక్షోభం ముగింపునకు ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) చేసిన తాజా ప్రతిపాదనలను ఆయనతో చర్చించారు. పుతిన్‌తో తన సంభాషణ ఫలవంతంగా సాగిందని ట్రంప్ పేర్కొన్నారు. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ పూర్తి సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణకు తెరదించేందుకు తొలుత ట్రంప్ 28 పాయింట్ల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఉక్రెయిన్ దాన్ని 20 పాయింట్ల ప్రణాళికగా సవరించిన సంగతి తెలిసిందే..
మరోవైపు తమకు బలంగా మద్దతిస్తున్న యూరోపియన్ యూనియన్ యూనియన్, నాటోలోని మిత్రదేశాలతో జెలెన్ స్కీ సంప్రదింపులు జరిపారు. కెనడా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కీలక చర్చలు చేశారు. ఉక్రెయిన్ అనుసరిస్తున్న దౌత్య విధానాలను వారికి వివరించారు.






