బ్లాక్ శారీలో అదరగొడుతున్న ఆర్ఎక్స్100 బ్యూటీ
ఆర్ఎక్స్100(RX100) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పాయల్ రాజ్పుత్(Payal Rajput) మొదటి సినిమాతోనే అదిరిపోయే ఎంట్రీ అందుకోవడమే కాకుండా ఆ సినిమాతో మంచి సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా వల్ల వచ్చిన క్రేజ్ తో పలు అవకాశాలను అందుకున్నప్పటికీ అమ్మడికి స్టార్డమ్ అయితే దక్కలేదు.

అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న ఆర్ఎక్స్100 బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేసే పాయల్ తాజాగా బ్లాక్ అండ్ గోల్డ్ లైనింగ్ శారీలో మెరిసిపోతూ కనిపించింది. ఈ డిజైనర్ శారీలో పాయల్ ఎంతో అందంగా ఉందని ఆమె ఫోటోలకు లైకులు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.