నీలిమ ఫిలిమ్స్ ‘నీలిమలై’
పల్లెర్ల ఆనంద్ కృష్ణ కధానాయకుడిగా, వృషాలి గోస్వామి కథానాయికగా, పల్లెర్ల ఆనంద్ నిర్మించిన చిత్రం ‘నీలిమలై’. ఈ చిత్ర నిర్మాత పల్లెర్ల ఆనంద్ మాట్లాడుతూ “ఇటీవల రిలీజ్ చేసిన మా చిత్రం ఆడియో మంచి విజయం సాధించింది. పాటలు చాలా బాగా ఉన్నాయని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఈ నెలలో పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతుండటంవల్ల మా చిత్రం రిలీజ్ ని మే నెలకి పోస్ట్ ఫోన్ చేసాము. మా చిత్రాన్ని చుసిన డిస్ట్రిబ్యూటర్స్ చాలా బాగుంది అని మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో వున్నాం” అని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు సూర్యకిరణ్ ఇలాటి మాట్లాడుతూ “నిర్మాత పల్లెర్ల ఆనంద్ గారు మరియు ఈ చిత్రానికి పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరు బాగా సహకరించారు. చిత్రం అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఏ చిత్రానికైనా పాటలు విజయం సాధిస్తే సినిమా సగం విజయం సాధించినట్లే.. మా సినిమాలో పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మా చిత్రం కచ్చితంగా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. మే నెలలో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు చూసి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాము” అన్నారు.
