చీరలో మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ
నన్ను దోచుకుందువటే(Nannu Dochukunduvate) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్(Nabha natesh) మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులేసుకుంది.తర్వాత ఇస్మార్ట్ శంకర్(ismart shankar) సినిమాతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న నభా, మధ్యలో యాక్సిడెంట్ కారణంగా కెరీర్ లో బ్రేక్ తీసుకుంది.

ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఇస్మార్ట్ బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.
తాజాగా నభా ఆలివ్ గ్రీన్ కాటన్ శారీ కట్టుకుని, చేతికి గాజులు, చెవులకు బుట్టలు పెట్టుకుని, సింపుల్ హెయిర్ స్టైల్ లో ఎంతో చూడముచ్చటగా కనిపించింది.ఈ ఫోటోలకు ఆమె ఫాలోవర్లు తెగ లైకులు చేస్తూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.