Mrunal Thakur: డెకాయిట్ లో ఎన్నో రిస్కీ సీన్స్ చేశా
పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్(mrunal thakur), తన తాజా చిత్రం డెకాయిట్(Dacoit) ద్వారా మరోసారి భిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ల మేళవింపుగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె పోషించిన సరస్వతి పాత్ర తన కెరీర్లో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందని మృణాల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాత్రలోని ఎమోషనల్ డెప్త్, అంతర్లీన సంఘర్షణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆమె పేర్కొన్నారు.
అడివి శేష్(adivi sesh) హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌కు డైరెక్టర్ షానియల్ డియో(Shaniel deo) దర్శకత్వం వహిస్తుండగా, అనురాగ్ కశ్యప్(Anurag kashyap) కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) సమర్పణలో సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda) నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచగా, ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజువల్‌గా హాలీవుడ్ స్థాయి అనుభూతిని అందించేలా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు మృణాల్ చెబుతున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను పలు రిస్కీ స్టంట్స్ చేసినట్టు వెల్లడించారు. ఛేజింగ్ సన్నివేశాలు, హ్యాండ్ బ్రేక్ లేకుండా ఉండే అంబులెన్స్ నడిపే సీక్వెన్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చెప్పారు. తెలుగు ప్రేక్షకులతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆమె, సీతారామం(Sitaramam), హాయ్ నాన్న(Hi Nanna), ఫ్యామిలీ స్టార్(Family Star) వంటి చిత్రాల ద్వారా వచ్చిన ఆదరణ తనకు ఎంతో విలువైనదని తెలిపారు. హీరో శేష్ ప్యాషన్‌ను ప్రశంసించిన మృణాల్, ఈ సినిమా ఆయన కెరీర్లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
