నగలను మించి మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ
శ్రీ(Sri) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమన్నా భాటియా(Tamannaah Bhatia), తక్కువ టైమ్ లోనే ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది. మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, బిజినెస్ కోసం కష్టపడుతూ కెరీర్లో ముందుకెళ్తూ ఉంటుంది.

అయితే కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తమన్నా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోల్లో తమన్నా స్విమ్ సూట్ ధరించి తన కొత్త మోడల్ జువెలరీ నెక్ చైన్ ను పరిచయం చేస్తూ తన అందాలను ఆరబోసింది. ఈ ఫోటోల్లో తమన్నా నగల కంటే మెరిసిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.