మెహారీన్కు లక్కీ ఆఫర్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రానుందని ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త. ఎట్టకేలకు ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది చివరిలో చిత్రాన్ని ప్రారంభించనున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. త్రివ్రికమ్ ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ సినిమాతో బిజీగావుంటే, ఎన్టీఆర్ బాబితో రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నార. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యకే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సెట్స్‌పై కలవనున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయికగా కృష్ణగాడి వీర ప్రేమగాథతో తెలుగు తెరకు పరిచయమైన మెహరీన్ ఎంపికైనట్టు సమాచారం. మెహరీన్ ఇప్పటికే మంచి ఆఫర్ల ఎదురు చూస్తున్నాయి. అయితే ఇటీవల ఆమె ఓ రెండు అవకాశాలను వదిలేసింది. వాటిస్థానంలో ఎన్టీఆర్ చిత్రం వచ్చి చేరింది. ఈ చిత్రానికి కాల్షీట్లు లేకపోయినా తొలుత ఒప్పుకున్న మరో రెండు ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంతో త్రివిక్రమ్ చిత్రంలో నటించడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మెహరీన్ సాయిధరమ్‌తేజ్‌తో ఓ చిత్రం, రవితేజతో మరో సినిమాలోనూ నటిస్తోంది.
