బోల్డ్ సీన్స్ ను తీసేయాలని కియారా రిక్వెస్ట్
కన్నడ స్టార్ యష్ (Yash) హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ టాక్సిక్(Toxic) మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్గా నటిస్తుండగా, ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్(Geethu mohandas) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక బోల్డ్ ఎపిసోడ్‌పై ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం ప్రకారం, ఈ సీన్ ను డైరెక్టర్ స్పెషల్ గా డిజైన్ చేయగా, షూటింగ్ టైమ్ లో కియారా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే, ఆ ఎపిసోడ్‌ను చూసిన తర్వాత ఆమె అభిప్రాయం మారినట్టు తెలుస్తోంది.
సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత కియారా, ఆ ఇంటిమేట్ సీన్ ను ట్రిమ్ చేయాలని యూనిట్‌ను కోరినట్టు సమాచారం. అంతేకాకుండా, సాధ్యమైతే ఆ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించాలని కూడా సూచించినట్టు టాక్ వినిపిస్తోంది. షూటింగ్ సమయంలో కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ, ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత ఈ మార్పు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్, హీరో యష్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే, ఇది గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా. ఈ ప్రాజెక్ట్ కోసం యష్ చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. భారీ బడ్జెట్‌తో KVN ప్రొడక్షన్స్(KVN Productions) ఈ సినిమాను నిర్మిస్తోంది. అలాగే నయనతార(nayanthara), హుమా ఖురేషి(Huma Qureshi), తారా సుతారియా(Tara Sutaria), రుక్మిణి వసంత్(Rukmini vasanth) లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కియారా తన మ్యాటర్నిటీ బ్రేక్‌కు ముందే ఈ సినిమా షూట్ పూర్తి చేయగా, సినిమా రిలీజ్ లేటైంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
