Sharwanand: శర్వా మూవీలో కాంతార హీరోయిన్?
టాలీవుడ్లో ఆసక్తికర కాంబినేషన్‌గా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టు హీరో శర్వానంద్(sharwanand)- డైరెక్టర్ శ్రీను వైట్ల(sreenu vaitla) మూవీ. ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. జులై మొదటి వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తన స్టైల్ కామెడీ, యాక్షన్ మిక్స్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో శ్రీను వైట్ల స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో కాంతార హీరోయిన్ కన్నడ నటి రుక్మిణీ వసంత్(Rukmini vasanth) ఫిక్స్ అయినట్టు సమాచారం. కాంతార చాప్టర్1(kanthara chapter1) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్ లో శర్వానంద్ సరసన ఎలా మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.

పాత్రకు తగ్గట్టు స్టైలిష్ గెటప్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. అదనంగా, ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో కీలక పాత్రలో కనిపిస్తాడన్న వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇవి కూడా చదవండి
ఇటీవల గోపీచంద్(gopichand) హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ విశ్వం(Viswam) ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో డైరెక్టర్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సరైన కాంబినేషన్, కొత్త లుక్, స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్‌తో ఈ సినిమా శ్రీను వైట్లకు మళ్లీ బిజీ షెడ్యూల్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి






