అజయ్ దేవగన్ భారీ విరాళం

బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ బృహన్‍ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి భరీ విరాళం ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ 20 పడకల కొవిడ్ ఐసీయూ ఏర్పాటు కోసం అజయ్ దేవగన్, ఆయన మిత్రులు కోటి రూపాయలు సాయం చేశారు. ముంబైలోని శివాజీ పార్కు ప్రాంతంలో భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ హాల్ వద్ద ఈ తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రిలో పారా మానిటర్స్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సపోర్ట్ తదితర సౌకర్యాలు ఉంటాయి. పీడీ హిందూజా ఆస్పత్రి వైద్యులు దీన్ని పర్యవేక్షించనున్నారు. ఈ మొత్తాన్ని అజయ్ దేవగన్ అర్గనైజేషన్ ఎన్‍వై ఫౌండేషన్ ఇప్పటికే బీఎంసీ అధికారులకు సమర్పించినట్టు సమాచారం. బాలీవుడ్ ప్రముఖులు సైతం అధికారులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజయ్ దేవగన్ కూడా ముందుకు రావడం విశేషం.