MATA: మాటా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా (Bathukamma-Dasara) వేడుకలు నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్సయింది. సెప్టెంబర్ 27వ తేదీన రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలకు ఎంట్రీ ఉచితం. ప్రముఖ గాయని, యాంకర్ దీప్తి నాగ్, ఇండియన్ ఐడల్ ఫేమ్ యుతి హర్షవర్ధన తమ గానంతో ఈ వేడుకల్లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ (Bathukamma-Dasara) కార్యక్రమంలో దుర్గా పూజ, బతుకమ్మ పోటీలు, రాఫెల్ టికెట్స్, ఉత్తమ దుస్తులు ధరించిన వారికి బహుమతులు, ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం వేణు గిరి (732) 910-9017, దీపక్ కట్టా (331) 580-0249, నరేందర్ ఎర్రగుంట్ల (201) 982-0284, పూర్ణ కరువూరు (848) 525-4625లను సంప్రదించవచ్చని మాటా (MATA) తెలిపింది. స్పాన్సర్‌షిప్, వెండర్ స్టాల్స్ కోసం విజయ్ భాస్కర్ కొలది (732) 774-2221, దీప్తి నాగ్ (732) 912-5958, శిరీష గుండపునేని (201) 410-3947లను సంప్రదించవచ్చు.
ఈ (Bathukamma-Dasara) కార్యక్రమాన్ని జోయాలుక్కాస్, తనిష్క్, శ్రీహర్ష, టెస్ట్ ప్రెప్ గురూస్, భాంజు, సిలికానాంధ్ర మనబడి, తదితర కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయి. శ్రీనిధి స్వీట్స్, ఉత్సవ్ గ్రాండ్, శ్రీదోస తదితర సంస్థలు ఫుడ్ స్పాన్సర్లుగా సేవలందిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాటా టీం కృషి చేస్తోంది.