Janasena: కూటమిలో చేరికలు ఉన్నట్టా..? లేనట్టా..?

2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ(YSRCP) క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన ఆ పార్టీలో, పలువురు కీలక నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు.. కొద్ది కాలానికే క్లారిటీ వచ్చింది. కొంతమంది నాయకులు జనసేన పార్టీలోకి వెళ్ళగా, మరి కొంతమంది తెలుగుదేశం(Telugu desham) పార్టీలోకి వెళ్ళారు. ఇక రెండు పార్టీల్లో ఆకాశం లేని నాయకులు బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారు. చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
దాదాపు పది మంది మాజీ ఎమ్మెల్యేల పేర్లు అప్పట్లో ప్రముఖంగా వినిపించాయి. వీరిలో దాదాపు ఆరుగురు రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. అయితే ఆ తర్వాత వాళ్ల గురించి ఎటువంటి ప్రచారం మీడియాలో జరగలేదు. సోషల్ మీడియాలో కూడా దీనిపై ఎటువంటి హడావుడి లేదు. అసలు పార్టీ మారుతున్నారా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. అయితే అప్పటివరకు పార్టీ మారిన వారి విషయంలో, టిడిపి(TDP) క్షేత్రస్థాయి నాయకత్వం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయడమే, కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు తలెత్తడంతో.. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
కొంతమంది నాయకులు జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా సరే, పవన్ కళ్యాణ్ వారిని వద్దని చెప్పినట్లుగా సమాచారం. తెలుగుదేశం పార్టీలోకి.. వెళ్లేందుకు కూడా కొంతమంది ప్రయత్నం చేసిన సరే, ఆ పార్టీ అధిష్టానం కూడా వారిని వద్దని వారించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తడమే కాకుండా, వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ఆయా.. నాయకులు వ్యవహరించిన శైలిపై పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పార్టీ మారితే, తమకు సమస్యగా ఉంటుందని, టిడిపి క్షేత్రస్థాయి నాయకత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే ఆ పార్టీ అధిష్టానం వెనక్కు తగ్గింది. ప్రస్తుతం బిజెపి మాత్రమే విషయంలో కాస్త దూకుడుగా ఉన్నా సరే, నియోజకవర్గాలతో సంబంధం లేని నాయకులను మాత్రమే తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.