TANA: మినియాపాలిస్‌లో ఫుడ్ ప్యాకింగ్ కార్యక్రమం చేపట్టిన తానా నార్త్ సెంట్రల్ చాప్టర్

మిన్నెసోటాలోని మినియాపాలిస్‌లో తానా (TANA) నార్త్ సెంట్రల్ చాప్టర్ ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమం జరిగింది. తానా అధ్యక్షుడు నరేన్ కోడాలి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు ప్రోద్బలంతో, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ రామ్ వంకిన ఆధ్వర్యంలో ‘ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్’ (FMSC) కేంద్రంలో ఆహార పదార్థాల ప్యాకింగ్ కార్యక్రమాన్ని తానా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. తానా (TANA) బృందం ప్యాక్ చేసిన ఈ పోషక ఆహారం పలు దేశాలలో ఆకలితో బాధపడుతున్న పిల్లలకు సహాయపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎఫ్ఎంఎస్‌సీ (FMSC) నిర్వాహకులు తానా (TANA) చేస్తున్న సేవలను ప్రశంసించారు. అవసరమైన పిల్లలకు ఆహారం పంపిణీ చేయడంలో తానా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన రామ్ వంకినకి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తానా (TANA) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కోడాలి (Naren Kodali) మాట్లాడుతూ.. అమెరికాలోని పలు రాష్ట్రాలలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లలో వెంకట్ జువ్వ, వేదవ్యాస్ అర్వపల్లి, జయరాం నల్లమోతు, అజయ్ తాళ్లూరి వంటి తానా (TANA) ప్రతినిధులు, యువ వాలంటీర్లకు ప్రశంసాపత్రాలు కూడా అందజేశారు.