Gayapadda Simhgam: ‘గాయపడ సింహం’ నుంచి వైరల్ ‘బ్రైడ్ సాంగ్’ రిలీజ్
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం‘ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచాయి. ఈ రోజు సెకండ్ సింగిల్ ‘బ్రైడ్ సాంగ్’ను విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ లేటెస్ట్ సింగిల్‌ను ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ మూడ్‌ను ఫ్రెష్‌గా, ఫన్‌తో నింపేలా రూపొందించారు. పెళ్లి ముందు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న వధువు భావాలను అందంగా ప్రజెంట్ చేస్తోంది. సాధారణంగా కనిపించే సింపుల్ ప్రెజెంటేషన్‌కు భిన్నంగా, ఈ పాటలో వధువును బోల్డ్‌గా, స్టైలిష్‌గా, ఫుల్ ఆఫ్ లైఫ్‌గా చూపించారు.సంగీత దర్శకుడు స్వీకర్ ట్రెండీ బీట్స్‌తో పాటు ఫెస్టివ్ ఫ్లేవర్‌ను అద్భుతంగా మేళవించారు. ఆయన పాడిన ఇంగ్లీష్ పార్ట్స్, శ్రీమణి రాసిన ఎనర్జిటిక్ తెలుగు లైన్స్ కలిసి ఈ పాటకు కూల్, కాంటెంపరరీ టచ్‌ను ఇచ్చాయి. ఈ లిరిక్స్‌లో నేటి వెడ్డింగ్ హంగామా, సెల్ఫీలు, రీల్స్, గ్లామ్ టచెస్, వైరల్ అవ్వాలనే ఎగ్జైట్మెంట్ స్పష్టంగా కనిపిస్తాయి.ఫారియా తన ఎనర్జిటిక్ మూవ్స్, ఎక్స్‌ప్రెసివ్ పెర్ఫార్మెన్స్తో స్క్రీన్‌పై మెరిసింది. బ్రైడల్ జాయ్‌ను ఎంతో సహజంగా క్యారీ చేస్తుంది. ఈ పాటకు మరింత వైబ్రెన్సీ తీసుకొచ్చింది మనీషా ఈరబత్తిని వాయిస్. ఆమె రిఫ్రెషింగ్ వోకల్స్ ఈ సాంగ్‌ను వెంటనే ప్లేలిస్ట్‌లో పెట్టేలా చేస్తాయి.చివర్లో తరుణ్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చి, తనదైన ఫన్ వైబ్‌తో ఈ సెలబ్రేషన్‌ను మరింత డబుల్ చేశారు.ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌న, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందిస్తున్నారు.గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి
