గూగుల్ సరికొత్త ఆప్షన్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నెటిజన్ల కోసం సరికొత్త ఆప్షన్‌ను తీసుకురాబోతున్నది. డెస్క్‌టాప్ వర్షన్ గూగుల్ క్రోమ్‌లో వ్యాసాల్ని, ఆర్టికల్స్‌ను చదవాల్సిన పనిలేకుండా స్పీచ్ ఫంక్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నది. రీడ్ అలౌడ్ అనే ఆప్షన్‌ను కూడా ఏర్పాటు చేసింది. డెస్క్‌టాప్ రీడింగ్ మోడ్‌ను ఎంపికచేయగానే సదరు వ్యాసాన్ని, ఆర్టికల్‌ను సదరు నెటిజన్ వినొచ్చు. గూగుల్ క్రోమ్‌కు అడ్వాన్స్డ్ వెర్షన్ గూగుల్ కానరీ లో ఈ కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తున్నట్టు సమాచారం. రీడ్ అలౌడ్ అనే ఆప్షన్ పనితీరుపై సదరు సెర్చ్ ఇంజిన్ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తుందని సోషల్ మీడియాలో సందేశాలు వెలువడ్డాయి.






