వాట్పాన్ వినియోగదారులకు మరో శుభవార్త
వాట్సాప్ తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. వాట్సాప్ ద్వారా ఇతరులకు హెచ్డీ క్యాలిటీ ఫొటోలను పంపేందుకు ఇటీవల కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టిన ఆ సామాజిక మాధ్యమం ఇప్పుడు ఆ పీఛర్ను వీడియోలకూ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై వాట్సాప్ వినియోగారులు హెచ్డీ క్యాలిటీ వీడియోలను కూడా షేర్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ను ఐవోఎస్తో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకూ అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. హెచ్డీ క్యాలిటీ వీడియోలను షేర్ చేసుకోవాలనుకునే వారు స్క్రీన్ పై భాగంలోని హెచ్డీ బటన్ను ట్యాప్ చేయాలని తెలిపింది.






