వాట్సాప్ లో సరికొత్త ఆప్షన్.. హెచ్డీ నాణ్యతతో
వాట్సాప్‌లో సరికొత్త ఆప్షన్ యూజర్లకు అందుబాటులోకి రాబోతున్నది. ఫొటోల్ని హెచ్డీ క్యాలిటీ ఫార్మాట్లోకి మార్చి పంపే సౌలభ్యాన్ని తీసుకువస్తున్నట్లు కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లకు ఈ సరికొత్త ఆప్షన్ మరికొద్ది రోజుల్లో అందుబాటులో రానున్నట్టు తెలిపారు. అంతేగాక హెచ్డీ క్యాలిటీ వీడియోలను సపోర్ట్ చేసే విధంగా వాట్సాప్‌ను ఆప్ గ్రేడ్ చేస్తున్నామని జుకర్‌బర్గ్ తెలిపారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్ట్‌ఫోన్, వెబ్లలోనూ కొత్త ఆప్షన్లు అందుబాటులో కి వస్తాయని మెటా ఓ ప్రకటనలో పేర్కొన్నది. హెచ్డీ ఐకాన్‌పై క్లిక్ చేయటం ద్వారా సరికొత్త ఆప్షన్లను ఎంచుకోవచ్చని వివరించింది.






