వాట్సాప్ లో కొత్త ఫీచర్స్
భారత్‌లో వ్యాపారుల కోసం వాట్సప్ మాతృ సంస్థ మెటా కొన్ని కొత్త ఫీచర్ లను తీసుకొచ్చింది. ముంబయిలో జరిగిన మెటా రెండో వార్షిక సమావేశంలో ఈ టూల్స్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్‌లోని ప్రజలు, వ్యాపారులు వాట్సప్‌ను సమర్థంగా వినియోగించి పనులు చక్కబెట్టుకొంటున్నారని కొనియాడారు. ఈ విషయంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మెటా తీసుకొచ్చిన కొత్త వాట్సప్ ఫీచర్లను జుకర్‌బర్గ్ పరిచయం చేశారు. మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్, వాట్సప్ చాట్‌లోనే పేమెంట్‌ను సైతం పూర్తి చేసే సదుపాయం తీసుకొస్తున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. అలాగే కొత్తగా వాట్సప్‌లో ఫ్లోస్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయం ద్వారా చాట్ థ్రెడ్స్‌లోనే వినియోగదారులకు కావాల్సిన సేవలను అందించొచ్చని పేర్కొన్నారు.






