వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. కారణం ఇదే
మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ భారత్లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది. 2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు వాట్సాప్ తాజా నివేదికలో వెల్లడిరచింది. మరోవైపు జూన్ నెలలో 7,893 ఫిర్యాదులు అందగా వీటిలో 337 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.






