America Federal: ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం

అంచనాలకు అనుగుణంగానే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఈనెల 28, 29 తేదీల్లో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) సమావేశం అనంతరం నిర్ణయాలను వెల్లడిరచింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు స్వీకరించాక ఇదే తొలి ఎఫ్‌ఓఎంసీ (FOMC) సమావేశం. ప్రస్తుతం అమెరికా వడ్డీ రేట్లు (Interest rates) 4.25- 4.50 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఉద్యోగ మార్కెట్ పరిస్థితులు బలంగానే ఉన్నాయని, ద్రవ్యోల్బణం మాత్రం లక్ష్యం కంటే కొంచెం అధికంగా ఉందని ఫెడ్ తెలిపింది.